26, సెప్టెంబర్ 2017, మంగళవారం

Flash flash flash


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rss)
అంటే ఏంటనీ?...

చాలామందికి తెలియవలసిన విషయాలు.

కుల,జాతి,వర్గ,వైషమ్యాలు లేకుండా క్రమ శిక్షణ తో ఒకే భగవద్వజం నీడలో... దేశము పట్ల ప్రేరణ ఇస్తూ
దేశభక్తులను తయారు చేసే సంస్థ నే rss...

Rss నిత్యం సంఘ శాఖ ఆధారంగా వ్యక్తి నిర్మాణము చేస్తుంది.

----------------------------------------
సంఘశాఖ సరళి ...

శాఖ ప్రారంభం
ధ్వజారోహణము ధ్వజప్రణామము సూర్యనమస్కారములు ఆసనములు ..
శారీరక వ్యాయము
దండ ప్రహరణలు ..
యోగ / ఆసనములు ..
దండ
కరాటే
ఆటలు ..
ముఖ్య సమాజహిత సూచనలు ..
దేశభక్తి భావపూరిత సంబంధిత పురాణపురుషుల వీరగాధలు/ కధలు ..
గీతాలాపన...
సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి..

ప్రార్ధన
శాఖ ముగింపు ఉంటాయి .
----------------------------------------

పండుగలు మరియు కొన్ని శుభసందర్బములలో ప్రత్యేక కార్యక్రమములుంటాయి .

ఆర్ఎస్ఎస్ గురించితెలుసుకోవలసిన కొన్ని ముఖ్యవిషయాలు ..!
************************************************************

ఆర్ఎస్ఎస్ అంటే చాలు బారతదేశంలో ఓ సంచలనం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడుకునే మాటల్లో ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. 1925 సెప్టెంబర్ 25న డాక్టర కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్దమానంగా పెరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ గా పేరుపొందింది. భారతమాత కోసం పని చెయ్యాలనుకొనే, దేశం అంటే అభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. అందరం కలిసి దేశం కోసం మనం అన్న కోణంలో పుట్టుకొచ్చిందే ఆర్ఎస్ఎస్. దేశాభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా కూడా ఇందులో చేరవచ్చు కానీ ప్రపంచానికి ఎంతో పరిచయమున్న ఆర్ఎస్ఎస్ గురించి మీకు తెలియని తొమ్మిది నిజాలు...

1. ఆర్ఎస్ఎస్ కు మనదేశంలో అనునిత్యం జరిగేవి 65 వేలు  శాఖలు ఉన్నాయి . ఈ సంస్థను నడుపుతున్నవారు  కూడా అందులోని సభ్యులే. భగ్వధ్వజ(కాషాయం జెండా) ఆర్ఎస్ఎస్ లో అధినాయకత్వం. ఇక్కడ వ్యక్తి పూజ లుండవు . ఆర్ఎస్ఎస్ లో ఉండే వాళ్లు కూడా ఈ జెండానే గౌరవిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో సేవకులు(వాలంటీర్లు) ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. దాదాపు 60లక్షల మంది వాలంటీర్లతో ఎంతో మంది అభిమానులతో ఆర్ఎస్ఎస్ ఘననీయమైన సేవలను అందిస్తోంది...

2.ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకున్నా కానీ ఎవరికీ గుర్తింపు కార్డు(ఐడెంటిటి కార్డ్) కానీ బిజినెస్ కార్డ్ కానీ ఇవ్వరు. కేవలం భారతమాతకు సేవ చెయ్యాలని అనుకున్న వారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. .

3. ఆర్ఎస్ఎస్ రాజకీయేతర సంస్థ. కానీ మోదీ, వాజ్ పేయి, అడ్వానీ లాంటి బిజెపి నాయకులు మాత్రం ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన వాళ్లు. అయితే చాలా మంది బిజెపి పార్టీలో ఆర్ఎస్ఎస్ భాగం అని అనుకుంటారు. ఒక్క బిజెపి పార్టీలోనే కాదు కాంగ్రెస్, ఆప్ పార్టీలలో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ధ్యేయం ఒక్కటే యువత వ్యక్తిత్వాన్ని మలిచడం ద్వారా దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడం...

4.ఇండో చైనా యుద్దం జరిగే సమయంలో దేశ భ్రదతకు అందరు సరిహద్దుల వద్ద యుద్దంలో ఉంటే అప్పుడు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ సంస్థ ముందుకు వచ్చింది. వేల మంది ఆర్ఎస్ఎస్ సేవకులు యుద్దసమయంలో సేవాకార్యక్రమంలో  పాల్గొన్నారు. ఎప్పుడు దేశంలో సంక్షోభం వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారు...

5. ఆర్ఎస్ఎస్ అనేది ముస్లింలకో లేదా క్రిస్టియన్ లకో వ్యతిరేకం కాదు. దేశమంటే గౌరవం అభిమానం ఉండి సేవ చెయ్యడానికి సిద్దంగా ఉన్న వాళ్లు ఎవరైనా ఆర్ఎస్ఎస్ లో చేరవచ్చు. మన సంస్రృతి సంప్రదాయాలను కాపాడేందుకు, దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ కట్టుబడి ఉంటుంది...

6. ఆర్ఎస్ఎస్ లో కేవలం మగ వారికే కాదు మహిళలకు కూడా స్థానం ఉంది. "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" అని పురుషుల కోసం విబాగం ఉంటే, మహిళల కోసం "రాష్ట్రీయ సేవికా సమితి " అని ప్రత్యేక విభాగం ఉంది. కానీ రెండింటి లక్ష్యం మాత్రం ఒక్కటే...

7.సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నడూ కూడా ఆర్ఎస్ఎస్ ను విభేదించలేదు. కానీ 1948లో మాత్రం రాజకీయ వత్తిడిల నేపథ్యంలో కొన్నాళ్లు ఆర్ఎస్ఎస్ పై నిషేదం విధించారు. కానీ తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేశారు. అయితే నిషేదం ఎత్తివేసిన తర్వాత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అంటూ ఆర్ఎస్ఎస్ గురించి లేఖ రాశారు...

8. అతికొద్దిమంది  మంది మహాత్మా గాంధీని చంపించింది ఆర్ఎసఎస్ అని ఆరోయిస్తుంటారు . కానీ నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ లో వాలంటీర్ గా కొనసాగి, 1930లోనే ఆర్ఎస్ఎస్ నుండి బయటకు వెళ్లిపోయారు. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు నాధూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్
లో లేరు,ఎవరిసొంత అభిప్రాయాలు వారికుంటాయి కొందరు అవలంబించే పద్ధతులు నచ్చక,వారి మనస్సు ఏది చెబితే దానికి తలవంచి విధి వంచితులవుతుంటారు.  

9.జాతీయ ఉదార భావాలున్న ఆర్ఎస్ఎస్ ను మహాత్మాగాంధీ మరియు డాక్టర్ అంబెడ్కర్ గార్లు  ఎంతో అభిమానించే వారు. 1963 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ పరేడ్(కవాతు) నిర్వహించారు.దాదాపు 3500 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఎర్రకోట సాక్షిగా రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు...!

***********************************************
         దేశ విభజన సమయంలో ఆర్.ఎస్.ఎస్.
***********************************************

1940 జూన్ 21న డాక్టర్జీ మరణానంతరం వారి అభీష్టానుసారం శ్రీ యం.ఎస్.గోళ్వాల్కర్ (శ్రీ గురూజీ) సర్సంఘచాలక్గా బాధ్యతలు స్వీకరించారు. తన మరణానికి ముందురోజు 1940 జూన్ 20న డాక్టర్జీయే స్వయంగా గురూజీతో ‘ఇకపై మీరే సంఘకార్య భారం స్వీకరించాలి’ అని చెప్పారు. కృష్ణరావ్ మొహరిల్, యాదవరావ్ జోషీలు దీనికి సాక్షులుగా ఉన్నారు. వారు ఈ సమాచారాన్ని అందరికీ తెలియపరిచారు. డా||హెడ్గేవార్ 13వ రోజు కర్మ ముగిసిన తరువాత 1940 జులై 3న విదర్భ ప్రాంత సంఘచాలక్ బాబాసాహెబ్ పాథ్యే సర్సంఘచాలక్గా శ్రీ మాధవ సదాశివ గోళ్వల్కర్ పేరును అధికారికంగా ప్రకటించారు. తదుపరి 33 సంవత్సరాలపాటు శ్రీ గురూజీ ఈ బాధ్యతను నిర్వహించారు.

క్విట్ ఇండియా ఉద్యమం

ఈ 33 సంవత్సరాల కాలంలో జాతీయ జీవనంలోని అనేక రంగాలపై సంఘం తనదైన ముద్రవేసింది. ప్రస్తుత వ్యాసం 1947 వరకు జరిగిన సంఘటనలు చెప్పేందుకు మాత్రమే పరిమిత మైనందున ఆర్.ఎస్.ఎస్. సర్సంఘచాలక్ శ్రీ గురూజీ స్పందించవలసి వచ్చిన రెండు క్లిష్ట పరిస్థితులను మాత్రమే పరిశీలిద్దాం. మొదటిది 1942లో వచ్చిన క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినది, రెండవది దేశవిభజనకు సంబంధించినది.

మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942లో ప్రారంభించ దలచలేదని, 1943 ఫిబ్రవరిలో ప్రారంభించాలనుకున్నారని తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. కనుక బ్రిటిష్ వారు భారత్ను వదిలి వెళ్ళటానికి ఆయన ఆరు నెలలు సమయమిచ్చారు. ఈ పథకం గురించి బ్రిటిష్ గూఢచారి విభాగానికి తెలిసింది. ఆనాటి యునైటెడ్ ప్రావిన్స్ (నేటి ఉత్తరప్రదేశ్) గవర్నరు వైస్రాయికి ఒక లేఖలో ‘1943 ఫిబ్రవరిలో గాంధీ ఒక పెద్ద ఉద్యమం మొదలు పెట్టబోతున్నాడు, అదే సమయంలో సుభాష్చంద్రబోస్ జపాన్ సాయంతో దాడి చేయాలని పథకం వేస్తున్నాడు’ అని వ్రాశాడు. (అధికార బదిలీ, 1972లో బహిర్గత పరచిన బ్రిటిష్ ప్రాచీన అధికార పత్రాలు). గాంధీజీ తమకు సమయం ఇవ్వటం లేదని, దేశవ్యాప్త ఉద్యమం కోసం వేచి చూస్తున్నాడని బ్రిటిష్వారు గ్రహించారు. కాంగ్రెసు నాయకులంతా 1942 ఆగష్టు 9న ముంబై చేరినందున, బ్రిటిష్వారు వారెంట్లు సిద్ధం చేసుకోవడంతో పాటు వారిని అరెస్టు చేసిన మీదట ఎవరిని ఎక్కడకు పంపించాలనేది కూడా నిర్ణయించి సిద్ధపడ్డారు.

అంతిమ పోరాటం కోసం దేశం మానసికంగా సిద్ధంగా ఉంది. ప్రముఖ నాయకులనందరిని అరెస్టు చేయడంతో వారి ఆగ్రహం అధికమైంది. కాని ఎలాంటి సమన్వయం గాని, ప్రణాళికగాని లేవు. తత్ఫలితంగా కొన్నిచోట్ల మరీ దూకుడుగాను, మరికొన్నిచోట్ల మరీ చప్పగాను నడిచింది. మహాత్మాజీ ఆశించినట్లు ఆరునెలల సమయం దొరికి ఉంటే సరియైన ప్రణాళిక వేసుకునే అవకాశం ఉండేది. ఆయన అందరిని సంప్రదించి ఉండేవారు. తూర్పు క్షేత్రంలో ఆజాద్ హింద్ ఫౌజ్ వారిచే బయట నుంచి దాడి, దేశంలో అంతర్గతంగా సామూహిక ఉద్యమం జరిగి ఉంటే బ్రిటిష్ వారు తప్పక ఇరుకునబడి ఉండేవారు. సంఘం కూడా తన పాత్ర నిర్వహించి ఉండేది.

ఒక సంస్థగా సంఘం ఆ ఉద్యమంలో పాలుపంచుకొనకపోయినప్పటికీ స్వయంసేవకులు ఉద్యమంలో పాల్గొన్న మాట వాస్తవం. అప్పట్లో సంఘానికి తానుగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించగల శక్తి సామర్థ్యాలు లేవు. డా||హెడ్గేవార్ జీవించి ఉంటే ఉద్యమం వెనుక సంఘశక్తిని నిలిపి ఉండేవారని కొందరి అభిప్రాయం. అయితే వారు సంఘాన్నిగాని, డాక్టర్జీనిగాని అర్థం చేసుకోలేక పోయారని చెప్ప గలను. 1942 ఉద్యమంలో సంఘ పాత్ర గురించి 1942లోనే మాననీయ దత్తోపంత్ ఠేంగ్డేజీ గురూజీతో చర్చించారు. సంఘశక్తి సామర్థ్యాల గురించి ప్రజల్లో వాస్తవ దూరమైన అంచనాలున్నాయని శ్రీ గురూజీ ఆయనతో చెప్పారు. సంఘశక్తి గోండియా నుంచి బెల్గాం వరకే పరిమితమై ఉంది. ఇది ఎక్కువగా మధ్యభారత్ ప్రాంతంలోనే. తక్కిన ప్రాంతాలలో సంఘ బలం అంతంత మాత్రమే. సంఘం అలాంటి ప్రయత్నమేదైనా చేస్తే బ్రిటిష్వారు సులభంగా దానిని మూలకు త్రోసి ఉద్యమాన్ని అణగద్రొక్కి ఉండేవారు. ఈ కథనాన్ని మా|| సుదర్శన్జీ నాకు చెప్పారు.(Ref : RSS Past, Present & Future, Appendix-1), అయినప్పటికీ స్వయంసేవకులందరూ తమ శక్తి యుక్తుల మేరకు ఆ ఉద్యమానికి మద్దతు నివ్వాలని శ్రీ గురూజీ సందేశమిచ్చారు. స్వయంసేవకులు అలాగే చేశారు.

దేశ విభజనకు ముందు

గాంధీజీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేశవిభజనకు ఒప్పుకోరని సంఘం గట్టిగా నమ్మింది. అలా నమ్మడానికి గట్టి కారణాలే ఉన్నాయి. 1946 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలీగ్ వారికి ప్రత్యేక పాకిస్థాన్ దేశమే ఏకైక అజెండా కాగా కాంగ్రెసుపార్టీ ‘అఖండభారత్’ నినాదంతో పోటీ చేసింది. బెంగాల్ మినహా అన్ని ప్రాంతాల్లోను, ఆఖరుకు ముస్లిం మెజారిటీ కలిగిన వాయువ్య సరిహద్దు ప్రాంతం వంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెసే గెలిచింది. కనుక దేశవిభజనకు కాంగ్రెసు ఒప్పుకుంటుందని నమ్మడానికి ఎలాంటి కారణమూ లేదు.
1946 నవంబరులో శ్రీ గురూజీ ముల్తాన్ సంఘ చాలకులైన శ్రీ బలదేవ్ బర్మన్గారి నివాసంలో బసచేసి ఉన్నపుడు ‘పాకిస్తాన్ గురించి చాలా హడావిడి జరుగుతున్నది. అది వాస్తవరూపం ధరిస్తుందా?’ అని శ్రీ గురూజీని ఆయన ప్రశ్నించారు. శ్రీ గురూజీ స్పష్టంగా ఇలా జవాబిచ్చారు. ‘నాకు మహాత్మాగాంధీలో పరిపూర్ణ విశ్వాసముంది. పాకిస్తాన్ నిర్మాణ ప్రతిపాదనను ఆయన ఎన్నటికీ అంగీకరించరు. దేశ సమైక్యతను ఎలాగైనా కాపాడటానికి ఆయన ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా జిన్నా పెట్టే షరతులను అంగీకరించటం సంభవమే. కాని దేశవిభజనకు మాత్రం ఆయన ఎన్నటికీ అంగీకరించరు’ (Ref: Ranga Hari: Guruji Jeevan Charitra, p.124)
ప్రత్యక్ష చర్య (Direct Action)
దేశవిభజన కోసం కాంగ్రెసుపై ఒత్తిడి తీసుకు రావటానికి 1946 ఆగష్టు 6న జిన్నా ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చాడు. కలకత్తాలో హిందువులపై పాశవిక మైన మారణకాండ జరిగింది. నౌఖాలీలోనూ అదే తరహా దారుణం జరిగింది. పంజాబ్, సింధ్లలో కూడా అలాగే జరిగింది. ముస్లింలు సాగించిన ఈ రాక్షస చర్యలను ఎదుర్కొనడానికి హిందువులు సిద్ధంగా లేరు. గాంధీజీ మరికాస్త ముందుకుపోయి లార్డ్మౌంట్ బాటెన్తో ‘నెహ్రూ ప్రభుత్వాన్ని రద్దుచేసి జిన్నా కోరుకున్న ప్రభుత్వం ఏర్పడనివ్వండి’ అని ప్రతిపాదిం చారు. కాని కాంగ్రెసులోని ఇతర నాయకులు ఈ సలహాకు అంగీకరించలేదు. వారు దేశ విభజనకు నిశ్చయించుకున్నారు.

ప్రత్యక్ష చర్య రోజుల్లో కూడా ముస్లిం ప్రాబల్యం కలిగిన పంజాబ్లో హిందువులు గొప్ప పరాక్రమంతో పోరాడారు. నాగపూర్కు చెందిన ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త మాంట్ గోమెరీ జిల్లా (ప్రస్తుత పాకిస్తాన్లోని సహివాల్) లో ప్రచారక్గా ఉన్నారు. దేశవిభజన విషాదకర దినాలలో స్వయంసేవకులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఆయన 80 పుటల పుస్తకంగా వ్రాశారు. ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో సంఘ స్వయంసేవకులు హిందువులను, సిక్కులను సమైక్యపరిచారు. ముల్తాన్, మౌంట్గోమెరీ జిల్లాల్లో వారు నగరాల్లో అంతటా రహస్యంగా తిరిగి ఎక్కడెక్కడ దాడులు జరిగే అవకాశముందో ఆ సమాచారాన్ని అందజేశారు. ఆర్.ఎస్.ఎస్. తన సాధారణ శిబిరాలను అర్ధాంతరంగా రద్దుచేసింది.

దేశవిభజనకు అంగీకారం

చివరకు కాంగ్రెసు 1947 జూన్ 14-15 తేదీలలో జరిగిన మహాసభలలో దేశవిభజనకు అంగీకారం తెలిపింది. గోవింద వల్లభపంత్ అందుకు తీర్మానం ప్రతిపాదించగా పురుషోత్తమదాస్ టాండన్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు గాంధీజీ మాత్రమే ముందుకు వచ్చి తీర్మానాన్ని ఆమోదించవలసిన అవసరం గురించి వివరించారు. దేశవిభజనపై ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరదగకుండా చూడటానికి తేదీని 1947 ఆగష్టు 14గా ముందుకు జరిపారు. దీనితో మరింత వినాశం జరిగింది. వేలాది హిందువుల మృత కళేబరాలు పంజాబ్ నుంచి రావటం మొదలైంది. లక్షలాదిమంది శరణార్థులుగా రాసాగారు. ‘పంజాబ్ సహాయ సమితి’ ఏర్పాటైంది. సంఘానికి జనాదరణ బాగా పెరిగింది. స్వయంసేవకుల వల్లనే తాము బ్రతికి బట్టకట్టగలిగామని శరణార్థులంతా చెప్పసాగారు. పదవుల కోసం అర్రులు చాచే కాంగ్రెసు వారు ఇదంతా చూసి అసూయతో రగిలిపోయారు. నిజానికి గాంధీజీ హత్యకు ఒకరోజు ముందు-అంటే 1948 జనవరి 29న నెహ్రూ ‘నేను ఆర్.ఎస్.ఎస్.ను అణచిపారేస్తాను’ అన్నట్లు వార్త వచ్చింది. గాంధీ హత్యతో ఆయనకు ఆ పని చేసేందుకు సాకు దొరికినట్లయింది. సర్సంఘచాలక్ శ్రీ గురూజీని అరెస్టుచేసి ఆర్.ఎస్.ఎస్.ను నిషేధించారు.
సంఘ కార్యానికి అదొక పెద్ద అఘాతం. మొదటి 22 సంవత్సరాల కాలంలో ఆర్.ఎస్.ఎస్. తన కార్యాన్ని భాZరతదేశ వ్యాప్తంగా విస్తరించిందని, హిందూ సమాజ సంఘటన యొక్క ఆవశ్యకతకు దేశవ్యాప్తమైన ఆమోదం లభిస్తున్నదనే విషయాన్ని కూడా అది నిరూపిస్తున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి